AndhraKingTaluka: రామ్, భాగ్యశ్రీల క్లాసిక్ లవ్ మెలోడీ.. ‘చిన్ని గుండెలో’ సాంగ్ వచ్చేస్తోంది

AndhraKingTaluka: రామ్, భాగ్యశ్రీల క్లాసిక్ లవ్ మెలోడీ.. ‘చిన్ని గుండెలో’ సాంగ్ వచ్చేస్తోంది

రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రెండు పాటలను రిలీజ్ చేశారు. తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

‘చిన్ని గుండెలో’ అంటూ  సాగే పాటను అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సాంగ్ అనౌన్స్‌‌మెంట్ పోస్టర్‌‌‌‌లో రామ్, భాగ్యశ్రీ  క్లాసిక్ లవ్ మూమెంట్ ఇంప్రెస్ చేస్తోంది. భాగ్యశ్రీని రామ్ పైకి ఎత్తుతూ కనిపిస్తున్న స్టిల్ ఆకట్టుకుంది. 

రామ్ కెరీర్‌‌‌‌లో ఇది 22వ సినిమా. కన్నడ స్టార్ ఉపేంద్ర, వీటీవీ గణేష్, రావు రమేష్​, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ  మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.   వివేక్, మెర్విన్  సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 28న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.

ఇందులో రామ్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వీరాభిమానిగా కనిపించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమా కేవలం ఒక అభిమాని కథ మాత్రమే కాదు, అన్ని రకాల అభిమానులకు అంకితమిచ్చినట్లుగా ఉంటుంది.

ఈ విషయాన్ని రామ్ పోతినేని స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ప్రియమైన మెగా, లయన్, కింగ్, విక్టరీ, పవర్, సూపర్, రెబల్, టైగర్, మెగాపవర్, స్టైలిష్, రియల్, రజనీ..  ఫ్యాన్స్ తో పాటు ఇతర స్టార్స్ ఫ్యాన్స్ అందరికీ, మిమ్మల్ని మీరు తెర మీద చూసుకునే సినిమా ఇదని ఇటీవలే రామ్ ట్వీట్ చేశారు.