జూన్ 7న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఏం చర్చిస్తారంటే..

జూన్ 7న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఏం చర్చిస్తారంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ ఏడున  కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1 ‌లో ఈ భేటీ జరగనుంది. ఈ కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం ( మే 28) వరకు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆదివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అమిత్‌ షాతో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన జగన్.. ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని జగన్ కోరారు. ఢిల్లీలో ఏపీ భవన్‌ సహా.. షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజనపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలని కోరారు. ఏపీ విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వెంటనే ఈ బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పర్యటనలోని అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల సంవత్సరం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంవత్సరంలోకి వెళుతున్న తరుణంలో, క్యాబినెట్ సమావేశం వ్యూహాత్మక నిర్ణయాల తయారీకి, విధాన రూపకల్పనకు , ఒత్తిడితో కూడిన ఆందోళనలను పరిష్కరించడానికి కీలకమైన వేదికగా పనిచేస్తుంది. YSRCP ప్రభుత్వం సాధించిన విజయాలను అంచనా వేయడానికి, కొనసాగుతున్న కార్యక్రమాలను అంచనా వేయడానికి మరియు భవిష్యత్ పాలన కోసం ఒక కోర్సును రూపొందించడానికి ఇది ఒక అవకాశంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. సమావేశాలు సజావుగా, సమర్ధవంతంగా జరిగేలా చూసేందుకు, క్యాబినెట్ క్లియరెన్స్ కోసం తమ ప్రతిపాదనలను జూన్ 5 మధ్యాహ్నం 2 గంటలలోపు సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఈ ఆదేశం ఎజెండాను క్రమబద్ధీకరించడం మరియు సమావేశంలో సమాచారంతో నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.