‘వైసీపీ-టీడీపీ-జనసేన.. ఈ పార్టీల‌న్నీ బీజేపీ గొడుగు కింద పనిచేసేవే’

‘వైసీపీ-టీడీపీ-జనసేన.. ఈ పార్టీల‌న్నీ బీజేపీ గొడుగు కింద పనిచేసేవే’

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వ‌హించింది. ఇందిరా భవన్‌లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, తులసి రెడ్డి, పల్లం రాజు హాజ‌రయ్యారు

అధ్య‌క్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ.. AP లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే స్టాండ్ పై చర్చ జరిగిందన్నారు. అమరావతి తో పాటు కోర్టుల్లో ఉన్న అంశాలు- దేవాలయ అంశాల పై చర్చించామ‌ని చెప్పారు. తాము మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకమ‌ని, అసెంబ్లీ లో ఆనాడు చంద్రబాబు-జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటేనే అమరావతిలో రాజధాని వచ్చిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఒకమాట ఇవ్వాళ ఒకమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో రాజధాని అంశం పై అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ పై ఉంద‌న్నారు. వైసీపీ-టీడీపీ-జనసేన ఈ పార్టీల‌న్నీ బీజేపీ గొడుగు కింద పనిచేసే పార్టీలేన‌ని శైల‌జానాథ్ విమ‌ర్శించారు. ఏపీ లో దళితుల పై జరిగిన దాడుల్లో ప్రత్యక్ష పరోక్షంగా అధికార నేతలు ఇన్ వాల్యూ అయ్యారని అన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు రైతుల తరపున పోరాటం చేసి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాంది మాట్లాడుతూ.. దేశ-రాష్ట్ర రాజకీయాల పై చర్చించామ‌ని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కేంద్రం ప్రభుత్వ తీరు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వాలు మారినా…. ప్రభుత్వ హామీలు మర్చిపోవద్దని అన్నారు

ఏపీ ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్ళ జరుగుతున్నా కేంద్రం ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఏపీ లో పార్టీని బూత్ లెవల్ నుంచి బలోపేతం చేస్తామ‌ని అన్నారు. బూత్ లెవల్ కమిటీలు వేస్తామ‌ని…ప్రజల్లో నిరంతరం ఉంటామని చెప్పారు