పెళ్లి సంబంధాలు చూడట్లేదని ఏకంగా తండ్రినే హతమార్చాడు ఓ కసాయి కొడుకు. తనకు పెళ్లి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని తండ్రిపై కట్టెతో దాడితో చేశాడు కొడుకు. ఈ క్రమంలో తండ్రి తలకు తీవ్ర గాయమయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... జగిత్యాల జిల్లాకు చెందిన అన్వేష్ హోటల్ మేనేజ్మెంట్ చదివి.. ఐదేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు.. పెళ్లి సంబంధాల విషయంలో తండ్రి గంగ నరసయ్యతో తరచూ గొడవపడేవాడు అన్వేష్.
ఈ క్రమంలో తండ్రిపై కోపాన్ని పెంచుకున్న అన్వేష్ సోమవారం ( నవంబర్ 11 ) తండ్రితో గొడవకు దిగాడు. నరసయ్య తలపై కట్టెతో దాడి చేశాడు అన్వేష్.దీంతో నరసయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. నరసయ్యను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు నరసయ్య.
ఈ ఘటనపై నరసయ్య చిన్న కూతురు హారిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధ్యత లేకుండా ఐదేళ్లుగా ఖాళీగా ఇంట్లో తండ్రి మీద ఆధార పడి తినడమే కాకుండా.. విచక్షణ లేకుండా తండ్రిని కొట్టి చంపిన అన్వేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బంధువులు. నరసయ్య మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
