ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 15 న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ- వేలానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంటుంది. ప్లేయర్ల వేలానికి నెల రోజుల సమయం ఉన్నా తమకు నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్లేయర్ల ట్రేడింగ్ విండో ఓపెన్ అవడంతో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల బదిలీ కోసం చర్చలు మొదలుపెట్టాయి. మరోవైపు కొంతమంది ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్లను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాయి.
ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీం ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ బ్యాటర్ సురేష్ రైనా ఒక సలహా ఇచ్చాడు. ఐపీఎల్ 2026 ఆక్షన్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ను రిలీజ్ చేయాలని సూచించాడు. రైనా మాట్లాడుతూ ఇలా అన్నాడు. " ముంబై రోహిత్ ను రిటైన్ చేసుకోవాలి. అతని కెప్టెన్సీ జట్టుకు ఉపయోగపడుతుంది. పైగా చాలా ట్రోఫీలు అందించాడు. దీపక్ చాహర్ విషయంలో ముంబై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. ట్రెంట్ బౌల్ట్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాక్స్ ను రిలీజ్ చేయాలి". అని అని రైనా స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.
►ALSO READ | Kaun Banega Crorepati 17: క్రికెట్‌పై రూ.7లక్షల 50 వేల రూపాయల ప్రశ్న.. ఆన్సర్ ఏంటంటే..?
విల్ జాక్స్ ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు. ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ ఇప్పటివరకు మొత్తం 21 ఐపీఎల్ మ్యాచ్ లాడాడు. 19 ఇన్నింగ్స్‌లలో 463 పరుగులు చేశాడు. 27 యావరేజ్ తో ఆడిన జాక్స్.. బౌలింగ్ లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 21 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై తరపున ఆడుతూ నిరాశపరిచాడు. ఐపీఎల్ 2024 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన జాక్స్ ఒక సెంచరీతో జాక్స్ 230 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో జాక్స్ ను ముంబై రూ.5.25 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది.
