Richa Ghosh: టీమిండియా వికెట్ కీపర్‌కు అరుదైన గౌరవం.. డార్జిలింగ్‌లో రిచా ఘోష్ పేరిట కొత్త స్టేడియం

Richa Ghosh: టీమిండియా వికెట్ కీపర్‌కు అరుదైన గౌరవం.. డార్జిలింగ్‌లో రిచా ఘోష్ పేరిట కొత్త స్టేడియం

టీమిండియా మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ టీమిండియా వికెట్ పేరిట ఒక కొత్త స్టేడియంని నిర్మించనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని సోమవారం (నవంబర్ 10) అధికారికంగా ప్రకటించారు. బెనర్జీ డార్జిలింగ్‌లో రిచా ఘోష్ పేరుతో స్టేడియంను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ రిచాను అభినందిస్తూ.. "డార్జిలింగ్‌లో 27 ఎకరాల స్థలంలో త్వరలో ఒక స్టేడియం నిర్మిస్తాం. ఆ స్టేడియానికి "రిచా ఘోష్ స్టేడియం"గా పిలుస్తాం." అని హామీ ఇచ్చారు.

ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో 2025లో రిచా ఘోష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు ఆమెను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సత్కరించింది. బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) సహకారంతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిచా ఘోష్ కు బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం బంగా భూషణ్ తో పాటు రూ. 34 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 22 ఏళ్ల రిచా ఘోష్ ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా నియమించింది. 

ఈ కార్యక్రమంలో రిచా గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఇలా అన్నారు "రిచా కేవలం 22 ఏళ్ళ వయసులో ప్రపంచ ఛాంపియన్ అయ్యింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున మేము ఆమెను సత్కరించాము. ఆమె కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను. డార్జిలింగ్‌లో దాదాపు 27 ఎకరాల భూమి ఉంది. అక్కడ క్రికెట్ స్టేడియం ప్లాన్ చేయమని నేను మేయర్‌ని కోరాను. దీనికి రిచా క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టాలి. ప్రజలు భవిష్యత్తులో ఆమె ప్రదర్శనను గుర్తుంచుకుంటారు. క్రికెట్ లో రావాలనుకునే చాలామంది ప్రేరణ పొందుతారు."అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

టీమిండియా ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడంలో రిచా ఘోష్ కీలక పాత్ర పోషించింది. టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో మొత్తం 235 పరుగులు చేసింది. లెగ్ దశలో ఆమె సౌతాఫ్రికాపై 94 పరుగులు చేసి విజయం కోసం తీవ్రంగా పోరాడింది. ఫైనల్లో 24 బంతుల్లోనే 34 పరుగులు చేసిన రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అంతకముందు జరిగిన సీఎం ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై రిచా ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 16 బంతుల్లో 26 పరుగులు చేసి రాణించింది.