అజ్మతుల్లా అదుర్స్‌‌‌‌ ..యూఏఈపై అఫ్గాన్ విక్టరీ

అజ్మతుల్లా అదుర్స్‌‌‌‌ ..యూఏఈపై అఫ్గాన్ విక్టరీ

న్యూఢిల్లీ: అజ్మతుల్లా ఒమర్జాయ్ (4/15; 40 నాటౌట్) ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో విజృంభించడంతో టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో అఫ్గానిస్తాన్ కీలక విజయం అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 5 వికెట్లతో యూఏఈని ఓడించి సూపర్‌‌‌‌‌‌‌‌–8 రేసులో నిలిచింది. తొలుత యూఏఈ  నిర్ణీత 20 ఓవర్లలో 160/9 స్కోరు చేసింది. సోహైబ్ ఖాన్ (68), అలీషాన్ షరాఫు (40) రాణించారు. 

అనంతరం అఫ్గాన్ 19.2 ఓవర్లలో 162/5 స్కోరు చేసి గెలిచింది.  ఛేజింగ్‌‌‌‌లో  రహ్మనుల్లా గుర్బాజ్ (0), గుల్బాదిన్ నైబ్ (13) త్వరగానే ఔటైనప్పటికీ  ఇబ్రహీం జద్రాన్ (53) ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దాడు. ఆ తర్వాత  దార్విష్ రసూలీ (33)తో  కలిసి ఒమర్జాయ్  మరో 4  బాల్స్‌‌‌‌ మిగిలుండగానే జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. అఫ్గాన్ విజయం తర్వాత గ్రూప్–-డి నుంచి సౌతాఫ్రికా (6 పాయింట్లు) టాప్ ప్లేస్‌‌‌‌తో సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌కు చేరుకుంది. న్యూజిలాండ్ (4), అఫ్గాన్‌‌‌‌ (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.