సూపర్‌‌‌‌-8కు ఇంగ్లండ్‌‌‌‌ ..పోరాడి ఓడిన ఇటలీ

సూపర్‌‌‌‌-8కు ఇంగ్లండ్‌‌‌‌  ..పోరాడి ఓడిన ఇటలీ

కోల్‌‌‌‌కతా: అరంగేట్రం జట్టు ఇటలీ పట్టుదలగా పోరాడినా.. విల్ జాక్స్‌‌‌‌  (22 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో  53 నాటౌట్‌‌‌‌) మెరుపులకు తోడు జెమీ ఓవర్టన్ (3/18), సామ్ కరన్ (3/22) సత్తా చాటడంతో ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్ చేరుకుంది.  గ్రూప్‌‌‌‌–సిలో భాగంగా సోమవారం ఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో జరిగిన తమ చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇంగ్లండ్ 24 రన్స్ తేడాతో ఇటలీని ఓడించింది. తొలుత ఇంగ్లిష్ టీమ్ 20 ఓవర్లలో  202/7 స్కోరు చేసింది. జాక్స్‌‌‌‌తో పాటు  టామ్‌‌‌‌ బాంటన్‌‌‌‌ (30), ఫిల్ సాల్ట్ (28) , సామ్ కరన్ (25) కూడా రాణించారు.  క్రిషన్ కలుగమగె (2/41), గ్రాంట్ స్టెవార్ట్‌‌‌‌ (2/51) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో  ఇటలీ 20 ఓవర్లు ఆడి 178 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్ (2/35) దెబ్బకు స్టార్టింగ్‌‌‌‌లో 22/3తో నిలిచిన ఇటలీ ఆ తర్వాత అద్భుతంగా పోరాడింది.  బెన్‌‌‌‌ మనెంటి (25 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో  60 ), జస్టిన్‌‌‌‌ మోస్కా (43) మెరుపులతో ఓ దశలో 114/3తో  నిలిచింది. మధ్యలో ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకున్నా..  గ్రాంట్ స్టెవార్ట్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45)  చెలరేగడంతో ఐర్లాండ్  ప్రత్యర్థికి షాకిచ్చేలా కనిపించింది.  కానీ, 19వ ఓవర్లో స్టెవార్ట్‌‌ను ఔట్ చేసిన  సామ్ కరన్ (3/22) ఇంగ్లండ్‌‌‌‌ను గెలిపించాడు. జాక్స్ ప్లేయర్ ఆఫ్‌‌  ద మ్యాచ్‌‌గా నిలిచాడు.    గ్రూప్‌‌‌‌–సి ఇంగ్లండ్‌‌‌‌తో పాటు వెస్టిండీస్ సూపర్‌‌‌‌‌‌‌‌ 8 చేరుకోగా.. స్కాట్లాండ్‌‌‌‌, ఇటలీ, నేపాల్‌‌‌‌ టోర్నీ  నుంచి నిష్క్రమించాయి.