తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు.. ఏపీ మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలు

 తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు.. ఏపీ మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలు

విజయవాడ : తెలంగాణ విద్యావ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదంటూ వ్యాఖ్యానించారు. అక్కడంతా (తెలంగాణ) చూచి రాతలు, కుంభకోణాలు.. రోజూ మనం చూస్తునే ఉన్నాముగా అని మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది అన్నారు. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి.. అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. విజయవాడలో గురువారం (జులై 13న) ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కామెంట్స్ చేశారు. 

ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. నీ రాష్ట్రం నువ్వు చూసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రాకపోతే పూట గడవలేని పరిస్థితుల్లో ఏపీ ఉందంటూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని లేని రాష్ట్రం కూడా తెలంగాణ గురించి మాట్లాడుతుందంటూ చురకలంటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ విద్యా వ్యవస్థ ఏపీ కంటే ఎంతో బాగుందని.. తెలంగాణ వస్తే చూపిస్తామంటూ ఛాలెంజ్ చేశారాయన.