ఆరు జట్లతో ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

ఆరు జట్లతో  ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

ఐపీఎల్..రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ను రెండు నెలలపాటు ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో మరో లీగ్   అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్ తరహాలో క్రికెట్ విందును వడ్డించేందుకు ఏపీఎల్  ముస్తాబవుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్  ఆధ్వర్యంలో   ఆంధ్రా ప్రీమియర్ లీగ్  త్వరలో స్టార్ట్ కాబోతుంది. 
  
జులై 6 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నీ మొదలవనుంది. ఈ మ్యాచులన్నీ..వైజాగ్ లోనే జరుగుతాయి. ఏపీఎల్ మ్యాచులు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్  అవుతాయి.  జులై 17 న ఫైనల్ నిర్వహిస్తారు.  సేమ్ ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్ జరగనుంది. లీగ్లో  మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. అయితే  ఫ్రాంఛైజీల కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బిడ్డింగ్స్‌ను ఆహ్వానించగా... మొత్తం 27 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో తొమ్మిదింటిని షార్ట్ లిస్ట్ చేసిన ఏసీఏ... చివరికి ఆరు ఫ్రాంఛైజీలకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.  వీటికి రాయలసీమ కింగ్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్.. పేర్లు పెట్టారు. 

ప్రతీ జట్టులో 20 మంది ప్లేయర్లు ఉంటారు.  వీరితో పాటు హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, ఫిజియోతో పాటు మరో నలుగురు సపోర్టింగ్ స్టాఫ్‌ ఉంటారు. ఈ ఆరు ఫ్రాంఛైజీలను వేర్వేరు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు.  రాయలసీమ కింగ్- దశరథ రామిరెడ్డి, ఉత్తరాంధ్ర లయన్స్- కేవీఆర్ ఎస్టేట్స్, గోదావరి టైటాన్స్- మాల్విన్ గ్లోబల్, కోస్టల్ రైడర్స్- సూర్య గ్రానైట్స్, బెజవాడ టైగర్స్- ఆంధ్రా హాస్పిటల్స్, వైజాగ్ వారియర్స్- పల్సస్ గ్రూప్ దక్కించుకున్నారు.