ఫైవ్ స్టార్ హోటల్లో 15 రోజులుండి బిల్లు కట్టకుండా జంప్

ఫైవ్ స్టార్ హోటల్లో 15 రోజులుండి బిల్లు కట్టకుండా జంప్

ఏపీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసి డబ్బులు కట్టకుండా రూ.  6 లక్షల మోసం చేసింది.  ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఝాన్సీ రాణి శామ్యూల్ అనే మహిళ ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలోని పుల్‌మన్ హోటల్‌లో 15 రోజుల పాటు బస చేసింది. ఇందుకు రూ. 5 లక్షల 88 వేల 176 బిల్లు అయింది.  ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ ద్వారా డబ్బులు పడినట్లు హోటల్  సిబ్బందికి చూపించింది.  కానీ డబ్బులు పడకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

విచారణలో ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 41 మాత్రమే ఉన్నట్లుగా తేలింది.  ఆమె హోటల్ లో  రూ. 2 లక్షల 11 వేల 708 విలువైన సేవలను పొందినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు.  మహిళా విచారణకు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు. తానో వైద్యురాలని, తన భర్త కూడా వైద్యుడని, న్యూయార్క్‌లో నివసిస్తున్నానని మహిళా చెప్పిందని పోలీసులు తెలిపారు.   ఝాన్సీ రాణిపై ఐపీసీ  సెక్షన్లు 419 (వంచించడం), 468 (మోసం ), 471 (నిజమైన నకిలీ డాక్యుమెంట్‌గా ఉపయోగించడం) ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.