ఆండ్రీ రస్సెల్ అరుదైన ఘనత

ఆండ్రీ రస్సెల్ అరుదైన ఘనత

విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అరుదైన ఘనతను సాధించాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు.  సిక్స్‌టీ లీగ్‌లో 10 ఓవర్ల ఫార్మాట్‌లో ట్రిన్ బాగో నైట్‌రైడర్స్ జట్టుకు ఆడుతున్న రస్సెస్..బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 

6 బంతుల్లో 6 సిక్సులు..
సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టాడు. మొదటి నాలుగు సిక్సులను ఒక ఓవర్లో..మరో రెండు సిక్సులను తర్వాతి ఓవర్ మొదటి రెండు బంతుల్లో బాదాడు.  పేట్రియాట్స్ బౌలర్ డ్రేక్స్ వేసిన 7వ ఓవర్ చివరి నాలుగు బంతుల్లో రస్సెల్ 4 సిక్సర్లు  కొట్టాడు.  ఆ తర్వాతి ఓవర్ లో ఫస్ట్ రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. మూడో బంతికి  ఫోర్ కొట్టాడు. దీంతో కేవలం 7 బంతుల్లోనే 40 పరుగులు సాధించడం విశేషం. 

న్యూ రూల్స్తో నయా రికార్డు..
క్రికెట్లో సాధారణంగా ఓవర్ అయిపోతే బ్యాటింగ్ ఎండ్స్ మారతాయి. కానీ సిక్స్ టీ టోర్నీలో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. వీటి ప్రకారం ఓవర్ ఓవర్కు బ్యాటింగ్, బౌలింగ్ ఎండ్స్ మారవు. ఒక ఎండ్ నుంచి వరుసగా 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేయొచ్చు. అనంతరం మరో ఎండ్ నుంచి మిగిలిన ఓవర్లను బౌలింగ్ చేస్తారు. దీంతో రస్సెల్ ఓవర్ మారినా స్ట్రైకింగ్‌లోనే కొనసాగి ఈ ఫిట్ను సాధించాడు. 

ట్రిన్ బాగో నైట్‌రైడర్స్ విజయం..
ఈ మ్యాచ్లో ఫస్ట్  బ్యాటింగ్ చేసిన ట్రిన్ బాగో నైట్‌రైడర్స్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. రస్సెల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. ఆ తర్వాత పేట్రియాట్స్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.