అబుదాబి నైట్ రైడర్స్కు కోల్కతా టీమ్ క్రికెటర్లు సైన్

అబుదాబి నైట్ రైడర్స్కు కోల్కతా  టీమ్ క్రికెటర్లు సైన్

యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ T20  లీగ్‌లో  పాల్గొనే అబుదాబి నైట్ రైడర్స్ ...తమ టీమ్ను ప్రకటించింది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్  జానీ బెయిర్‌స్టో కూడా,ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న ఐర్లాండ్‌ ఆటగాడు  పాల్ స్టిర్లింగ్ కూడా అబుదాబి ఫ్రాంచైజీలో భాగమయ్యారు.  ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడే అకేల్ హోసేన్, సీక్కుగే ప్రసన్న, రవి రాంపాల్, అలీ ఖాన్ కూడా అబుదాబీ ఫ్రాంఛైజీకి ఆడేందుకు సైన్ చేశారు. శ్రీలకం లెఫ్టార్మ్ బ్యాటర్ చరిత్ అసలంక కూడా అబుదాబికి తన క్రికెట్ సేవలందించనున్నాడు. 

అబుదాబి నైట్ రైడర్స్ టీమ్:
సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, రేమన్ రీఫర్, కెన్నార్ లూయిస్, రవి రాంపాల్ (వెస్టిండీస్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లాండ్), పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్), లాహిరు కుమార, చరిత్ అసలంక, సీక్కుగే ప్రసన్న (శ్రీలంక), కోలిన్ ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా), అలీ ఖాన్ (అమెరికా), బ్రాండన్ గ్లోవర్ (నెదర్లాండ్స్)

నైట్ రైడర్స్ టీమే ఉండటం సంతోషం..
అబుదాబి నైట్ రైడర్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ ప్లేయర్లే ఉండటం సంతోషంగా ఉందని  నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ అన్నారు. బెయిర్‌స్టో లాంటి గొప్ప ఆటగాళ్లు కూడా జట్టులో చేరడం ఆనందాన్నిస్తుందన్నాడు. నైట్ రైడర్స్ కుటుంబంలో కొత్తగా చేరిన పాల్ స్టిర్లింగ్, చరిత్ అసలంక, కెన్నార్ లూయిస్, లహిరు కుమార, రేమన్ రీఫర్, బ్రాండన్ గ్లోవర్‌లకు  స్వాగతం పలుకుతున్నట్లు చెప్పాడు. ILT20 ఒక ఉత్తేజకరమైన టోర్నమెంట్ అని భావిస్తున్నట్లు తెలిపాడు.  గ్లోబల్ క్రికెట్ టోర్నీల్లో తమ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు అడుగులు వేస్తుండడం చాలా  గొప్పగా ఉంది..అని వెంకీ మైసూర్ పేర్కొన్నాడు.

వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం..
యూఏఈ టీ20 లీగ్ 2023 జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. ఇందులో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. వీటిలో ఐదు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకున్నాయి. ఇందులో34 మ్యాచ్‌లుంటాయి.