చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై ..ప్రపంచంలోనే మొదటి బౌలర్

చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై ..ప్రపంచంలోనే మొదటి బౌలర్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ ఆండ్రూ టై వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు.  బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడిన టై ఫైన‌ల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బాజ్‌లేను ఔట్ చేసి 300 వికెట్ సాధించాడు.మొత్తంగా ఆండ్రూ టై 211 మ్యాచుల్లో 300 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. అతను 213 మ్యాచుల్లో 300 పడగొట్టాడు. తాజాగా ఆండ్రూ టై ఈ రికార్డును బద్దలు కొట్టాడు. 

టీ20ల్లో తక్కువ మ్యాచుల్లో 300 వికెట్లు తీసిన జాబితాలో లంక మాజీ బౌలర్ ల‌సిత్ మ‌లింగ మూడో స్థానంలో ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు దక్కించుకున్నాడు.  సౌతాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 247 మ్యాచుల్లో 300 వికెట్లు దక్కించుకోగా..సునీల్ నరైన్ 252 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు.

బిగ్‌బాష్ లీగ్‌లో ఆండ్రూ టై అద్భుతంగా రాణించాడు. ఈ సీజ‌న్‌లో 26 వికెట్లు పడగొట్టాడు. ఇక బీబీఎల్ 2023 సీజన్ లో విజేతగా పెర్త్ స్కార్చర్ నిలిచింది. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట  బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20  ఓవ‌ర్లలో  7 వికెట్లకు  175 పరుగులు  చేసింది. పెర్త్ స్కార్చెర్స్ 19.2 ఓవ‌ర్‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది.