ప్రజలు చస్తుంటే ఐపీఎల్ కొనసాగించడం అవసరమా? 

ప్రజలు చస్తుంటే ఐపీఎల్ కొనసాగించడం అవసరమా? 

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆండ్రూ టై ఐపీఎల్‌‌ను వీడాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లనున్నట్లు టై చెప్పాడు. అయితే భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ టైమ్‌లో ఐపీఎల్‌‌ను కొనసాగించడంపై అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ వల్ల జనాలకు వినోదం లభిస్తున్నప్పటికీ.. కరోనాతో ప్రజలు ఆస్పత్రుల్లో పడి ఉన్న ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ కంపెనీలు, ఫ్రాంచైజీలు, ప్రభుత్వం ఐపీఎల్‌‌ను కొనసాగించడం అవసరమా అని ప్రశ్నించాడు.

ఐపీఎల్ కొనసాగింపుపై ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సీరియస్ అయ్యాడు. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ టైమ్‌లో ఐపీఎల్‌ను కొనసాగించడం సరైనదేనా అని గిల్లీ ప్రశ్నించాడు. కావాలనే ప్రజల దృష్టి మళ్లించడానికి టోర్నీని కొనసాగిస్తున్నారా అంటూ క్వశ్చన్ చేశాడు. భారత ప్రజల కోసం ప్రార్థిస్తానని ట్వీట్ చేశాడు.