టెక్నాలజీ ..భూకంప హెచ్చరిక ఫోన్​కే!

టెక్నాలజీ ..భూకంప హెచ్చరిక ఫోన్​కే!

భూకంప హెచ్చరిక ఫోన్​కే! 

మనదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు ఇక నుంచి భూకంపాల గురించి అలర్ట్ ఫోన్​కి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన సెన్సర్ సిస్టమ్​ని గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్​లకు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్​లో ఉండే యాక్సిలోమీటర్ అనే సెన్సర్ భూకంపాన్ని అంచనా వేసి, అది రావడానికి ముందే హెచ్చరిస్తుంది. ఆండ్రాయిడ్ ఎర్త్​క్వేక్ అలెర్ట్స్ సిస్టమ్ ఇప్పటికే చాలా దేశాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు ముందుగానే హెచ్చరించి సాయం చేసింది. గూగుల్ దీన్ని ఇప్పుడు ఇండియాకు పరిచయం చేసింది. అంతేకాదు.. అందుకోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ అథారిటీ (ఎన్​డిఎంఎ), నేషనల్ సెస్మాలజీ సెంటర్ (ఎన్​ఎస్​సి)ని సంప్రదించింది. 

ఎలా పనిచేస్తుందంటే...

ఫోన్ ఛార్జింగ్​లో ఉండి, కదలకుండా ఉన్నప్పుడు, భూకంపం మొదటి సంకేతాలను పసిగట్టగలదు. చాలా ఫోన్​లు ఒకేసారి కదులుతున్నాయి అంటే భూకంపం వచ్చిందని గూగుల్ సర్వర్ గుర్తిస్తుంది. ఎక్కడ, ఎంత ఎక్కువ​గా వచ్చిందో ఆ సమాచారం తీసుకుంటుంది. అప్పుడు దగ్గర్లో ఉన్న ఫోన్​లకు అలర్ట్​ మెసేజ్​లు పంపిస్తుంది. భూకంపం పరిమాణాన్ని (మాగ్నిట్యూడ్) బట్టి రెండు రకాల అలర్ట్​లు వస్తాయి. మోడిఫైడ్ మెర్కాల్లి ఇంటెన్సిటీ స్కేల్ (ఎంఎంఐ) అనేది కంపనాల తీవ్రత చెప్తుంది. కాబట్టి ఎంఎంఐ 3, 4 షేకింగ్​, 4.5 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉంటే ‘బీ అవేర్ అలర్ట్’ అని మెసేజ్ వస్తుంది. రెండోది ఎంఎంఐ 5+ షేకింగ్​, 4.5 లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం ఉంటే ‘టేక్ యాక్షన్ అలర్ట్’ అని మెసేజ్ వస్తుంది.  

అలర్ట్ రావాలంటే..

ఇండియాలోని ఆండ్రాయడ్​5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఫోన్​లు వాడేవాళ్లకు అందుబాటులోకి వస్తుంది. అలర్ట్​లు రావాలంటే.. ఫోన్​లో ఇంటర్నెట్ కనెక్షన్, లొకేషన్ సెట్టింగ్స్ ఉండాలి. తర్వాత ఎర్త్​క్వేక్ అలర్ట్ సెట్టింగ్ ఆన్​లో పెట్టాలి. అదెలాగంటే... సెట్టింగ్స్​కి వెళ్లి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ట్యాప్ చేసి, తర్వాత ఎర్త్​ క్వేక్ అలర్ట్స్ మీద ట్యాప్ చేయాలి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ కనిపించకపోతే లొకేషన్​ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత అడ్వాన్స్​డ్​​, ఎర్త్​ క్వేక్​ అలర్ట్ ఆప్షన్స్​ని ఆన్ చేయాలి. ఆ అలర్ట్​లు భారతీయ భాషల్లోనే ఉంటాయి. కాబట్టి చదవడం, వాటిని ఫాలో అవడం చాలా ఈజీ. 

ఇక నుంచి మాట్లాడినా చాలు!

చాట్జీపీటీలో కొత్త ఫీచర్లు వచ్చేశాయి. ఇకనుంచి ఏదైనా సెర్చ్ చేయాలంటే టైప్ చేయాల్సిన పనిలేదు. వాయిస్తో మాట్లాడి చెప్తే సరిపోతుంది. ఆ మాటలను టెక్స్ట్ రూపంలోకి మార్చి, వాయిస్ రూపంలో సమాధానం ఇస్తుంది చాట్జీపీటీ. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ని ఎనేబుల్ చేయాలంటే... ఫోన్లో చాట్‌‌జీపీటీ యాప్‌‌ఓపెన్ చేసి, సెట్టింగ్స్ మెనూకి వెళ్లి, వాయిస్‌‌అసిస్టెంట్ ఎనేబుల్ చేయాలి. అక్కడ న్యూ ఫీచర్స్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసి, తర్వాత వాయిస్ కమాండ్స్ ఇవ్వాలి. అందులో ఐదు వేర్వేరు వాయిస్‌‌లను ఎంచుకునే వీలుంది. అది వినాలంటే... హోమ్ స్క్రీన్లో పైన కనిపిస్తున్న హెడ్‌‌ఫోన్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి.

ఈ వాయిస్‌‌ మనిషి మాట్లాడినట్లు ఉండడం కోసం ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్లతో డిజైన్ చేశారు. దానికి తోడు, ఓపెన్-సోర్స్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్.. మాట్లాడే పదాలను టెక్స్ట్‌‌గా మారుస్తుంది. అలాగే, మొత్తం వాయిస్ క్వాలిటీని బెటర్గా చేస్తుంది. అంతేకాదు.. ఇమేజ్ రికగ్నిషన్ ఫీచర్తో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అందుకోసం ఫొటోను అప్లోడ్ చేసి అందులో ఉన్న ప్రాబ్లమ్ చెప్తే, దానికి సొల్యూషన్ ఇస్తుంది చాట్జీపీటీ.