
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు వచ్చే నెల మొత్తం సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ( సీఐటీయూ అనుబంధం) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీత, జయలక్ష్మిలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో సెలవులు ఇస్తున్నారని, ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
మినీ అంగన్ వాడీ టీచర్లకు 11 నెలల వేతనం చెల్లించాలని, ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సమస్యలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం అందచేశామని, కర్నాటక ప్రభుత్వ జీవో కూడా అందచేశామని సునీత, జయలక్ష్మిలు వెల్లడించారు.