రైలు బోగీ తలుపు తీయలేదని.. అద్దాలు పగలగొట్టిన ప్యాసింజర్లు

రైలు బోగీ తలుపు తీయలేదని.. అద్దాలు పగలగొట్టిన ప్యాసింజర్లు

రైల్వే టికెట్ కొనడం వరకే మన పని.. కొన్న తర్వాత ట్రైన్ ఎక్కుతామా లేదా అనేది గ్యారెంటీ ఉండటం లేదు.. అవును మరి తోటి ప్రయాణికులే ఓ వ్యక్తిని ట్రైన్ ఎక్కకుండా అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైన్ కోచ్ డోర్ క్లోజ్ చేసి ఆ వ్యక్తికి కోపం తెప్పించేలా చేశారు సదరు ప్రయాణికులు. దీంతో కోపం తెచ్చుకున్న ప్లాట్ ఫాం పై నిల్చున్న వ్యక్తి ట్రైన్ డోర్ కు ఉన్న గ్లాస్ ను రాయితో కొట్టాడు. దీంతో గ్లాస్ పగిలిపోయి ప్రయాణికుల మీద పడిపోయింది. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందంటే.. 

ఓల్డ్ ఢిల్టీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజమ్ ఘర్ వెళ్తున్న కైఫియాత్ ఎక్స్ ప్రెస్ రైలు ఓ స్టేషన్ లో హాల్ట్ కోసం ఆగింది. దీంతో ట్రైన్ లో థార్డ్ ఏసీలో సీటు రిజర్వు చేసుకున్న ఓ ప్రయాణికుడు రైలు ఎక్కడానికి వచ్చాడు. ఈ క్రమంలోనే రైలులో ఉన్న ప్రయాణికులు అతన్ని ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ట్రైన్ కోచ్ డోర్ ను క్లోజ్ చేసి అతని బయటే ఉండేలా చేశారు.

తన వద్ద రిజర్వేషన్ ఉంది.,. టికెట్ చూడండి.. అని చూపించిన వినలేదు. దీంతో ప్లాట్ ఫాం పై నిల్చున్న వ్యక్తికి కోపం వచ్చింది. ఓ రాయి తీసుకుని ట్రైన్ పైకి విసిరాడు. ట్రైన్ కోచ్ కు ఉన్న గ్లాస్ పగిలిపోయింది. భయబ్రాంతులకు గురైన ట్రైన్ లోని ప్రయాణికులు అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయారు. 

ఈ మొత్తం సన్నివేశాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలాడు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని స్పందిస్తున్నారు.  బ్రదర్, రైల్వే పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది, ముఖ్యంగా జనరల్, స్లీపర్ క్లాస్ లో మీరు టిక్కెట్‌ను ధృవీకరించినట్లయితే, మీకు ఒలింపిక్ పతకం వచ్చినట్లు అర్థం చేసుకోండి అని ఓ వ్యక్తి కామెంట్ చేస్తే.. కొత్త రైళ్లు నడవనప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది, కొంత కాలం తర్వాత వందేభారత్ రైళ్లలో కూడా ఇలాగే చూస్తామని మరో వ్యక్తి కామెంట్ చేశారు.