ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టి.. కిందకు దూకేందుకు ప్రయత్నించిండు

ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టి.. కిందకు దూకేందుకు ప్రయత్నించిండు

యునైటెడ్ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్లేన్ టేకాఫ్ అవుతుండగా ఓ వ్యక్తి ఎమర్జెన్సీ ద్వారం కిందకు నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అంతకుముందు విమాన సిబ్బందని చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 కోడి బెంజమిన్ లోవిన్స్‌ అనే ప్రయాణీకుడు విమానం టేకాఫ్ చేయబోతుండగా అత్యవసర ద్వారం నుంచి కిందకు దూకడానికి ప్రయత్నించాడు. దాని కంటే ముందు విమాన సిబ్బందిని ఆ వ్యక్తి కొట్టాడు కూడా. దీనికి కారణం జిమెనెజ్ అనే వ్యక్తి తనకు కేటాయించిన సీటు నుంచి లోవిన్స్, అతని భార్యను అక్కడ్నుంచి లేవమని కోరడంతో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. దానికి వారు వినకపోవడంతో.. ఫ్లైట్ అటెండెంట్ లను కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో లోవిన్స్ అటెండెంట్ లను కూడా కొట్టాడు. ఆ తర్వాత కోపంతో రగిపోయిన లోవిన్స్... ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను బలవంతంగా తెరిచి దూకడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న జిమెనెజ్ కెమెరాలో బంధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంలో ఫ్లైట్ అటెండెంట్ జోక్యం చేసుకోవడంతో, లోవిన్స్ కోపానికి గురైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అత్యవసర ద్వారం వైపు వెళ్తోన్న అతన్ని తోటి ప్రయాణికులు ఆపడానికి కూడా ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. విమానాల్లో ఇలాంటి కొందరి ప్రవర్తన వల్ల మిగతా ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.