ఎప్ స్టీన్ ఫైల్స్‌‌‌‌ లో అనిల్‌‌‌‌ అంబానీ... 2017-19 మధ్య నాటి వాట్సాప్ చాటింగ్ లీక్‌‌‌‌

ఎప్ స్టీన్ ఫైల్స్‌‌‌‌ లో అనిల్‌‌‌‌ అంబానీ... 2017-19 మధ్య నాటి వాట్సాప్ చాటింగ్ లీక్‌‌‌‌

ఢిల్లీ: ఎప్‌‌‌‌స్టీన్ ఫైల్స్‌‌‌‌లో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, జెఫ్రీ ఎప్​స్టీన్ మధ్య జరిగిన సంభాషణ సంచలంగా మారింది. 2017–2019లో వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌‌‌‌లో స్వీట్స్ అనే  కోడ్‌‌‌‌తో సంభాషణలు జరిగాయి. అనిల్ అంబానీ విదేశీ పర్యటనల్లో అమ్మాయిలు ఏర్పాటు కోసమే ఈ చాటింగ్ జరిగిందని తెలుస్తోంది. అనిల్‌‌‌‌తో స్వీడన్ అమ్మాయి గురించి ఎప్‌‌‌‌స్టీన్ ప్రస్తావించగా ‘అరేంజ్ దట్’  అని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఎప్​స్టీన్‌‌‌‌కు చెందిన లగ్జరీ భవనాల్లో వారిద్దరు కలిసి భోజనం చేస్తూ వ్యాపారం గురించి చర్చించినట్లు సమాచారం. అయితే, ఎప్‌‌‌‌స్టీన్ తనకు ఉన్న చెడ్డ పేరు గురించి అనిల్‌‌‌‌తో చర్చించగా.. తన ఇంటికి చాలా మంది మంత్రులు వస్తుంటారని, అది నీపై ఎలాంటి ప్రభావం పడకుండా కాపాడుతుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.