కింగ్స్ ఎలెవన్ హెడ్ కోచ్ గా కుంబ్లే

కింగ్స్ ఎలెవన్ హెడ్ కోచ్ గా కుంబ్లే

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ టైటిల్‌‌ సాధించడమే లక్ష్యంగా కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌‌లో జరిగే వేలానికి వెళ్లే ముందే తమ జట్టు కోచింగ్‌‌ సిబ్బందిని పూర్తిగా మార్చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్‌‌ అనిల్‌‌ కుంబ్లేకు హెడ్‌‌ కోచ్‌‌ బాధ్యతలను అప్పగించింది.

అదేవిధంగా వెస్టిండీస్‌‌ గ్రేట్‌‌ కోట్నీ వాల్ష్‌‌ను బౌలింగ్‌‌ కోచ్‌‌గా ఎంచుకున్న ఆ జట్టు.. జాంటీ రోడ్స్‌‌(సౌతాఫ్రికా)ను ఫీల్డింగ్‌‌ కోచ్‌‌గా, జార్జ్‌‌ బెయిలీ(ఆస్ట్రేలియా)ని బ్యాటింగ్‌‌ కోచ్‌‌గా, సునీల్‌‌ జోషీ(ఇండియా)ని అసిస్టెంట్‌‌ కోచ్‌‌గా నియమించుకుంది. యంగ్‌‌ టాలెంట్‌‌ను గుర్తించే పనిని కూడా వాల్ష్‌‌కే అప్పజెప్పింది. ప్రస్తుతం ఐపీఎల్‌‌లో ఉన్న ఏకైక ఇండియన్‌‌ కోచ్‌‌ అయిన కుంబ్లే 2016–17 మధ్యలో టీమిండియా కోచ్‌‌గా పని చేశాడు.