IND vs ENG: రోహిత్ దగ్గరకు వెళ్లి ధైర్యంగా అడుగు.. జైశ్వాల్‌కు కుంబ్లే సలహా

IND vs ENG: రోహిత్ దగ్గరకు వెళ్లి ధైర్యంగా అడుగు.. జైశ్వాల్‌కు కుంబ్లే సలహా

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దుమ్ము లేపుతున్నాడు. ఏకంగా డబుల్ సెంచరీలతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. హైదరాబాద్ టెస్టులో సెంచరీ మిస్ అయిన ఈ యంగ్ స్టార్ ఆ తర్వాత వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో 109 యావరేజ్ తో 6 ఇన్నింగ్స్ ల్లో 545 పరుగులు చేసి  టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ ముంబై కుర్రాడి మీద అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే ఒక కీలక సలహా ఇచ్చాడు. 

3వ రోజు ఉదయం ప్రాక్టీస్ సెషన్ లో జైస్వాల్ అతని చేతిని తిప్పుతూ బౌలింగ్ వేస్తూ కనిపించాడు. అప్పటికే అశ్విన్ వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్ళిపోయాడు. ఒక బౌలర్ తగ్గడంతో బౌలింగ్ వనరుల కోసం జైస్వాల్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన అనీల్ కుంబ్లే జైశ్వాల్ తన బౌలింగ్ కొనసాగించాలని కోరాడు. అతనితో ఒక సహజమైన లెగ్ స్పిన్నర్ ఉన్నాడని.. రోహిత్ అతనికి బౌలింగ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. 

also read : IND vs ENG: నాలుగో టెస్ట్‌కు బుమ్రా దూరం.. అసలు కారణం ఇదే

మూడో టెస్టు ముగిసిన తర్వాత JioCinemaలో జైస్వాల్‌తో మాట్లాడిన కుంబ్లే.. జైశ్వాల్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా 'నువ్వు బ్యాటింగ్ బాగా చేస్తున్నావు. నువ్వు లెగ్ స్పిన్ బాగా బౌలింగ్ చేయగలవు. ఎప్పుడూ నువ్వు నీ లెగ్ స్పిన్ బౌలింగ్ ను వదులుకోవద్దు. ఎందుకంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుందో నీకు ఎప్పటికీ తెలియదు. రోహిత్ దగ్గరకు వెళ్లి కొన్ని ఓవర్లు ఇవ్వమని చెప్పు అని కుంబ్లే అన్నారు.

కుంబ్లే మాటలకు జైస్వాల్ స్పందిస్తూ.. ఈ సిరీస్‌లో ఎప్పుడైనా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ చెప్పాడని.. అందుకే బౌలింగ్ ప్రాక్టీస్ చేశానని జైస్వాల్ బదులిచ్చారు. ఇప్పటివరకు టెస్టుల్లో బౌలింగ్ చేయని జైశ్వాల్.. అంతర్జాతీయ T20I మ్యాచ్ లో 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో ఒక్క ఓవర్ ఓవర్ బౌలింగ్ చేశాడు.