వెలుగు కథనంపై స్పందించిన పశు సంవర్ధక శాఖ డైరెక్టర్

వెలుగు కథనంపై స్పందించిన పశు సంవర్ధక శాఖ డైరెక్టర్

హైదరాబాద్, వెలుగు:  గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాంచందర్ స్పష్టం చేశారు. ‘గొర్రెల పంపిణీ స్కీంలో బ్రోకర్ల దందా’ శీర్షికతో వెలుగులో వచ్చిన కథనంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ స్పందించారు. ఆంధ్రా రైతుల వద్ద కొనుగోలు చేసిన133 యూనిట్ల గొర్రెలను గుర్తించి, సేకరించి రంగారెడ్డి జిల్లా రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

 అయితే, ఆంధ్రాలో కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు చేరలేదనే దానిపై ఎంక్వైరీ జరుగుతోందని చెప్పారు. విచారణలో దోషులపై, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ జరుగుతోందని, మరోవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని డైరెక్టర్ వివరించారు.