హీరో వరుణ్ సందేశ్ను "సక్సెస్" పలకరించి చాలా కాలం అయింది. ప్రతి ఏడాది ఓ రెండేసి సినిమాలు చేస్తున్నప్పటికీ.. సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. గడిచిన రెండేళ్లలో వరుణ్ సందేశ్ సినిమాలు చూసుకుంటే.. మైఖేల్, ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, నింద, వీరాజీ, రాచరికం, కానిస్టేబుల్ వచ్చాయి. అయితే, వీటిలో ఏ ఒక్కటీ కూడా ఊర్లలో ఉండే సగటు సినీ అభిమానులకు కూడా తెలియకుండానే వెళ్లిపోయాయి.
ఈ క్రమంలోనే ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకునే పనిలో పడ్డాడు. ఇపుడు సరిగ్గా థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ కథతోనే వచ్చాడు వరుణ్ సందేశ్. అదే " నయనం" (Nayanam). బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ హీరోయిన్గా నటించింది. స్వాతి ప్రకాష్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 న స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఉత్కంఠకు గురిచేస్తోంది.
స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేసిన ఈ డిజిటల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇంట్రస్టింగ్గా ఉంది. ఇందులో వరుణ్ సందేశ్ కంటి డాక్టర్గా నటించాడు. ఇతరులు కళ్లద్దాల నుంచి నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది తాను చూడగలననే డిఫెరెంట్ క్యారెక్టర్ చేశాడు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ అసలు రూపం ఏంటి? అతను దాచి ఉంచిన సీక్రెట్స్ ఎలా బయటపడ్డాయనేది ఆసక్తిగా చూపించారు. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ లతో పాటుగా ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా, హరీష్ కీలక పత్రాలు పోషించి మెప్పించారు.
What a year end. What an incredible web series 🥳#NayanamOnZee5
— ZEE5 Telugu (@ZEE5Telugu) December 20, 2025
STREAMING NOW#Nayanam #NayanamOnZEE5 #VarunSandesh #Zee5 #TeluguZee5#webseries pic.twitter.com/XK5E4vhVtV
కథేంటంటే:
డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) ఒక బ్రిలియంట్ ఆప్తమాలజిస్ట్ (కంటి స్పెషలిస్ట్). అయితే.. అతనికి చిన్నప్పటినుంచి ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఒక ఇల్లీగల్ ఎక్స్‌పరిమెంట్స్ చేసి ప్రత్యేకమైన కళ్లజోడుని కనిపెడతాడు. ఆ గ్లాసెస్ పెట్టుకుని ఎవరినైనా చూస్తే వాళ్ల లైఫ్‌లో గడిచిన పన్నెండు గంటల్లో జరిగిన విషయాలన్నీ నాలుగు నిమిషాలపాటు కనిపిస్తాయి. ఆ గ్లాసెస్‌తో నయన్ తన దగ్గరకు వచ్చే పేషెంట్ల సీక్రెట్లను తెలుసుకుంటుంటాడు.
అలా ఒకరోజు ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన మాధవి (ప్రియాంక జైన్) తన భర్త గౌరీ శంకర్(ఉత్తేజ్)ను హత్య చేయడం ఆ కళ్లద్దాల ద్వారా చూస్తాడు. ఆమె తన భర్తను ఎందుకు చంపింది? అది తెలుసుకున్న నయన్ ఏం చేశాడు? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
