ఖర్గేకు స్వాగతం పలికిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఖర్గేకు స్వాగతం పలికిన పీసీసీ చీఫ్  మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు శనివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి కర్నాటకలోని గుల్బర్గా వెళ్తూ మార్గ మధ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఖర్గేకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్, ఇతర నేతలు స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మల్లికార్జున ఖర్గే ప్రత్యేక హెలికాప్టర్ లో గుల్బర్గా వెళ్లారు.