రాష్ట్ర కాటన్ అసోసియేట్ డైరెక్టర్ ఎన్నిక

రాష్ట్ర కాటన్ అసోసియేట్ డైరెక్టర్ ఎన్నిక

కాశీబుగ్గ, వెలుగు: రాష్ర్ట కాటన్​అసోసియేషన్, అసోసియేట్​ డైరెక్టర్​గా బొమ్మినేని రవీందర్​ రెడ్డిని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతల స్వీకరించిన రవీందర్​రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15న రాష్ర్ట కాటన్​ అసోసియేషన్​ నుంచి అసోసియేట్ డైరెక్టర్​గా ఎన్నుకున్న నేపథ్యంలో ముంబైలోని కాటన్​కార్పొరేషన్​ ఆఫ్ ​ఇండియా (సీసీఐ)లోని బాధ్యతలను తీసుకున్నట్లు చెప్పారు. 

ఆయనకు సీసీఐ చైర్మన్​ అండ్ మేనేజింగ్​ డైరెక్టర్​ లలిత్​ కుమార్​ గుప్తా, కాటన్​అసోసియేషన్​ సభ్యులు వినయ్, రమేశ్, తెలంగాణ కాటన్​మిల్లర్స్​అండ్​ ట్రేడర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.