బెట్టింగ్ యాప్ కు బానిస.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

బెట్టింగ్ యాప్ కు బానిస.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డిసెంబర్ 21న ఉదయం  హయత్ నగర్ లోని  తన ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు  కృష్ణ చైతన్య. ప్రస్తుతం అతడిని   కామినేని ఆస్పత్రికి తరలించారు. కామినేనిలో కృష్ణ చైతన్యకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణ చైతన్య  ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

రెండు సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్స్,  గేమింగ్ యాప్స్‌లో  డబ్బులు పోగొట్టుకున్నాడు  కానిస్టేబుల్ కృష్ణ చైతన్య. అప్పటి నుంచి   తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. ఈ కారణంతోనే  ఈరోజు ఉదయం  ఆత్మహత్యాయత్నం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆరోగ్య సమస్యలు

 కృష్ణ చైతన్య సుమారు మూడు నెలల క్రితం కుటుంబ సమస్యలతో మానసికంగా కలతచెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయింది. చాలా రోజుల నుంచి కృష్ణ చైతన్యకు  న్యూరోలాజికల్ సమస్యలు, ముఖ్యంగా మెదడులో రక్తగడ్డలు ఉన్నట్లు గుర్తించారు . ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధుల్లో మాత్రం సాధారణంగానే కొనసాగుతూ వచ్చాడని తెలుస్తోంది.