పుష్పతో పార్టీ సాంగ్..ఇన్ స్టా స్టోరీలో ఫోటో షేర్

పుష్పతో  పార్టీ సాంగ్..ఇన్ స్టా స్టోరీలో  ఫోటో  షేర్

ఓ వైపు సౌత్ ఇండియా, మరోవైపు బాలీవుడ్.. రెండుచోట్లా సినిమాలు చేస్తూ కెరీర్‌‌‌‌‌‌‌‌ను బ్యాలెన్స్ చేస్తోంది రష్మిక మందన్న. ఇటీవలే హిందీ చిత్రం ‘యానిమల్‌‌‌‌’ షూటింగ్‌‌‌‌ను పూర్తి చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. ఆ మూవీ షూటింగ్ పూర్తవడంతో ఇక సౌత్ సినిమాలపై ఫుల్‌‌‌‌ ఫోకస్ పెట్టింది రష్మిక. తాజాగా ‘పుష్ప 2’ మూవీ షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌ దగ్గరలోని ఓ రిసార్ట్‌‌‌‌లో జరుగుతోంది. 

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ పార్టీ సాంగ్‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. సాంగ్ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటున్నట్టు ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో కూడా షేర్ చేసింది రష్మిక. సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌‌‌‌ అనగానే స్పెషల్ సాంగ్స్‌‌‌‌ ఎంత పాపులరో తెలిసిందే. చంద్రబోస్‌‌‌‌ రాసిన ఈ పాట కూడా అంతే సూపర్ హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్, రష్మికతో పాటు ఇతర నటీనటులు ఈ సాంగ్‌‌‌‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప’లో రష్మిక వేసిన స్టెప్స్ ఆమెకు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. మరి ఈ సినిమాలో ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ వేస్తుందో చూడాలి!