నేనూ మంత్రి పదవి అడిగాను..ఎలా ఇస్తారో తెలీదు : అంజన్ కుమార్ యాదవ్

నేనూ మంత్రి పదవి అడిగాను..ఎలా ఇస్తారో తెలీదు : అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: పార్టీ హైకమాండ్ ను తానూ మంత్రి పదవి అడిగానని..అయితే ఎమ్మెల్సీని చేసి ఇస్తారో, జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారో తెలియదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. 

హైదరాబాద్ లో మెజార్టీ సామాజిక వర్గం యాదవులేనని.. ఆ సామాజిక వర్గంలో కాంగ్రెస్ కు తనకంటే ఎక్కువ సేవచేసిన వారు ఎవరూ లేరని చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి పదవి విషయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా కలిశానని పేర్కొన్నారు.