మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. డ్రైవర్ మృతి.. బస్సులో 30 మంది

మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. డ్రైవర్ మృతి.. బస్సులో 30 మంది

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకుపోవడంతో ఇల్లు ధ్వంసం అయ్యింది. బస్సు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం (ఆగస్టు 30) రాత్రి 9.30 ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.

 మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో  ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై జరిగింది ఈ ప్రమాదం. బస్సు ముందు భాగం ఏ మాత్రం మిగలకుండా మొత్తం డ్యామేజ్ అయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ తో మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.  పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. 

హైవే పక్కన ఇంట్లోకి బస్సు దూసుకుపోవడంతో ఇంటి ముందు ఉన్న రేకుల సఫారం పూర్తిగా కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.