
ప్రపంచంలో మొట్టమొదటి 6G నెట్ వర్క్ ను చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సెకనుకు 100 గిగాబిట్‌ల కంటే ఎక్కువ మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని అందించనుంది. ప్రపంచ దేశాలు ఇప్పటికీ 5G విస్తరణ దశలో ఉండగా, చైనా 6G వైపు అడుగులు వేయడం గ్లోబల్ టెలికాం రంగంలో గణనీయమైన మార్పులను తీసుకురానుంది.
6G టెక్నాలజీతో స్మార్ట్ సిటీల అభివృద్ధి వేగవంతం అవుతుంది. టెలీ–మెడిసిన్, రిమోట్ ఎడ్యుకేషన్ మరింత సులభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తృత స్థాయిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
ఆల్-ఫ్రీక్వెన్సీ 6G చిప్ అభివృద్ధి చేసి చైనా శాస్త్రవేత్తలు సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేశారు. ఈ కొత్త చిప్ గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య నెలకొన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించనుంది.
6G చిప్ అన్ని ఫ్రీక్వెన్సీలను సపోర్ట్ చేసే మల్టీ-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ. గ్రామీణ ,పట్టణ ప్రాంతాల మధ్య సమానమైన డిజిటల్ కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుత 5G కంటే వేల రెట్లు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ సామర్థ్యం కలిగివుంటుంది. లో-ఫ్రీక్వెన్సీ నుంచి హై-ఫ్రీక్వెన్సీ వరకు విస్తృతమైన నెట్‌వర్క్ కవరేజ్అందిస్తుంది.
6G చిప్ అభివృద్ధి కేవలం చైనాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతులను మార్చే సామర్థ్యం కలిగివుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో అధిక వేగం, తక్కువ ఖర్చుతో కనెక్టివిటీ అందించడానికి ఉపయోగపడుతుంది. నిపుణుల అంచనా ప్రకారం..6G టెక్నాలజీలో స్మార్ట్ సిటీల అభివృద్ధి వేగవంతం అవుతుంది.
టెలీమెడిసిన్, రిమోట్ ఎడ్యుకేషన్ మరింత సులభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తృత స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తాయి.
ఈ "ఆల్-ఫ్రీక్వెన్సీ 6G చిప్" అభివృద్ధి..సాంకేతిక ఆధిపత్యంలో చైనా మరో ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రపంచ దేశాలు ఇప్పటికీ 5G విస్తరణ దశలో ఉండగా, చైనా 6G వైపు అడుగులు వేయడం గ్లోబల్ టెలికాం రంగంలో శక్తి సమీకరణాలను మార్చే అవకాశముంది.