కరీంనగర్ టౌన్లో ఈ కంపెనీ తెలుసా..? 5 వేలు కడితే 50 వేలు వస్తదని నిండా ముంచేశారు !

కరీంనగర్ టౌన్లో ఈ కంపెనీ తెలుసా..? 5 వేలు కడితే 50 వేలు వస్తదని నిండా ముంచేశారు !

కరీంనగర్: ఇన్సూరెన్స్ చెల్లిస్తే భారీగా లాభాలు వస్తాయంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అంజనీ పుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి దగ్గర 5 వేల చొప్పున అనేక మంది దగ్గర డబ్బుల వసూలు చేసి సదరు సంస్థ బోర్డు తిప్పేసింది. 5 వేలు కడితే 50 వేల నుంచి కోటి రూపాయలు దాకా వస్తుందని సంస్థ నిర్వాహకుడు రమేష్ నమ్మబలికాడు. బాధితుల ఫిర్యాదుతో ఎస్సై వంశీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. చీటింగ్కు పాల్పడిన రమేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంగాధర పోలీస్ స్టేషన్‌కు అతనిని తరలించారు. రమేష్‌పై ఇప్పటికే పలు చీటింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

ఈ మోసానికి ఎలా పాల్పడేవారంటే.. పలు ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీల్లో ల్యాప్స్‌‌‌‌ పాలసీల డాటా తీసుకొచి పాలసీ హోల్డర్లకు కాల్స్ చేసేవారు. తమ సంస్థల్లో పాలసీలు తీసుకోవాలని చెప్పేవారు. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్‌‌‌‌ ఇస్తామని నమ్మించేవారు. వాట్సాప్‌‌‌‌లో కాంటాక్ట్‌‌‌‌తో పాలసీకి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకునేవారు. ఆ తరువాత పాలసీదారులను నమ్మించేందుకు నకిలీ డీడీలను క్రియేట్‌‌‌‌చేసేవారు. ఈ క్రమంలోనే పాలసీదారుల నుంచి 18 శాతం జీఎస్‌‌‌‌టీ, ఇతర చార్జీల పేరుతో అందినంతా దోచేస్తారు. పాలసీ మెచ్యూరిటీ దగ్గరగా ఉన్నవాళ్లకు ఇప్పుడే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపుతారు. ఇంకా టైమ్ ఉన్నవారికి పాలసీ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయమంటారా.. అని ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తారు.