World Beer Awards-2025.. ఇండియా బ్రాండ్ బీర్లకు అవార్డుల పంట.. ఈసారి బెస్ట్ క్వాలిటీ, టేస్టీ బీర్లు ఇవే !

World Beer Awards-2025.. ఇండియా బ్రాండ్ బీర్లకు అవార్డుల పంట.. ఈసారి బెస్ట్ క్వాలిటీ, టేస్టీ బీర్లు ఇవే !

సౌత్ లో.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వాడే బీర్లు ఏవంటే.. వెంటనే కింగ్ ఫిషర్, రాయల్ ఛాలెంజ్, బడ్వైజర్, ట్యూబర్గ్.. అంటూ మనోళ్లు వాడే బీర్ల పేర్లు చెప్పేస్తాం కదా. అయితే మద్యం ప్రియులు ఇకనుంచి ఈ బ్రాండ్ బీర్ల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీర్లలో బెస్ట్ క్వాలిటీ బీర్లుగా అవార్డు అందుకున్నాయి.  అవే సింబా బీర్లు. తక్కువ మందికి తెలిసిన ఈ బ్రాండ్ గురించి.. అవార్డు అందుకోవడం వెనుక ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.

సింబా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మద్యం ప్రియులు సెర్చ్ చేస్తున్న బీర్ బ్రాండ్. ప్రపంచ బీర్ అవార్డులు–2025 (World Beer Awards ) లో రెండు అవార్డులు గెలుచుకుని టాక్ ఆఫ్ ద వరల్డ్ గా నిలిచింది ఈ బ్రాండ్. సింబా విట్ (Simba Wit) బ్రాండ్ కు సిల్వర్ అవార్డు, సింబా స్టౌట్ (Simba Stout) కు బ్రాంజ్ అవార్డులు లబించాయి. బెస్ట్ టేస్టీ, క్వాలిటీ కేటగిరీలో ఈ ఇండియన్ బ్రాండ్ కు అవార్డులు రావడం విశేషం. 

వరల్డ్ బీర్ అవార్డుల గురించి:

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీర్ల క్వాలిటీ, టేస్టీ, కొత్త ఉత్పత్తులలో బెస్ట్ బీర్లను సెలెక్ట్ చేసి.. పాతవి, కొత్తవి కలిపి బెస్ట్ బీర్లు ఏవో ఈ కాంపిటీషన్ లో గెలిచిన బ్రాండ్ లకు అవార్డులు ఇస్తుంటారు. చాలా ప్రెస్టీజియస్ అవార్డులుగా చెప్తుంటారు వీటి గురించి . బీర్లు తయారు చేసే ఎక్స్పర్ట్లు, ఇండస్ట్రీ స్పెషలిస్టులు, రైటర్లు మొదలైన ప్యానలిస్టులు బెస్ట్ బీర్లు ఏవో ఫైనలైజ్ చేస్తారు. ప్రపంచంలోనే బెస్ట్ బీర్లను సెలెక్ట్ చేయడంతో పాటు.. ఆయా దేశాల్లో ఉత్తమ బ్రాండ్ ఏదో కూడా చెప్తారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఇస్తుంటారు.

ఈ కాంపిటీషన్ లో ఇండియా బ్రాండ్ సింబా రెండు అవార్డులు గెలుచుకోవడం విశేషం. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ, టేస్టీ బీర్లుగా సింబా కంపెనీకి చెందిన రెండు బీర్లు ఎంపికయ్యాయి. సంప్రదాయ బీర్ల తయారీ (Craft beer culture) కల్చర్ ప్రకారం ఇండియాలో ఎదుగుతున్న బ్రాండ్ గా సింబాను పేర్కొన్నారు నిర్వాహకులు. 

ఏంటి ఈ బీర్ల స్పెషాలిటీ:

సింబా విట్ బీర్:

ఈ బీర్ సిల్వర్ మెడల్ సాధించడం వెనుక దానికో ప్రత్యేకత ఉంది. సింబా విట్ బీర్.. బెల్జియన్ విట్ బీర్ లాగే ఉంటూ స్థానికంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తయారు చేస్తారంట. తయారీ కోసం గోధుమ మాల్ట్, కొత్తిమీర, ఆరెంజ్ తొక్కలను ఉపయోగిస్తారు. ఈ మూడు కలిపి డిఫరెంట్ టేస్టీతో పాటు ఒకరకమైన మత్తును కలిగిస్తాయట. ఫ్రెఫ్ సిట్రస్ (అంటే నిమ్మ ఫ్లేవర్) టేస్టీ, స్మూత్ గా ఉంటూ.. తాగటానికి చాలా స్మూత్ గా ఉండేలా తయారు చేస్తారు. ఇందులో కాస్త స్ట్రాంగ్ బ్రాండ్ కూడా ఉంటుంది. 

సింబా స్టౌట్ బీర్: 

ఈ బీర్ డార్క్ కలర్ లో ఉంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టౌట్ బీర్ల ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వేయించిన బార్లీ సీడ్స్, డార్క్ మాల్ట్ తో తయారు చేస్తారు. కాఫీ, చాకోలెట్, క్యారామెల్ తో చేసిన డార్క్ మాల్ట్ వినియోగించి.. కాస్త క్రీమీ స్ట్రక్చర్ లో కాస్త లైట్ చేదుగా ఉంటుందట ఇది. 

ప్రీమియం, ట్రెడిషనల్ టెక్నిక్స్:

రెండు బీర్లలో ప్రీమియం ఇంగ్రీడియెంట్స్ వినియోగించి తయారు చేస్తారు. సంప్రదాయ పద్ధతిలో ప్రస్తుత ట్రెండ్ కు అనుకూలంగా తయారు చేస్తారు. ఈస్ట్ ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) పద్ధతి చాలా కేర్ ఫుల్ గా.. బెస్ట్ ఫ్లేవర్ వచ్చేలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తయారు చేస్తారు. ఏడాదికి ఇన్ని మాత్రమే అన్నట్లుగా లిమిటెడ్ గా తయారు చేస్తారట. 

ఎక్కడ తయారు చేస్తారు:

ఇండియన్ క్రాఫ్ట్ బీర్లు అయిన సింబా బీర్లను ఛత్తీస్గఢ్ లో తయారు చేస్తున్నారు. 2016 లో భాటియా కుటుంబం ఈ బీర్ల తయారీ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రాఫ్ట్ బీర్లలో తమ ప్రసెన్స్ ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రీమియం బీర్లను తయారు చేస్తున్నారు. ప్రీమియం మార్కెట్లో వీటికి ఇప్పటికే మంచి నేమ్ ఉంది.