కరీంనగర్ జిల్లాలో ఘోరం.. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు !

కరీంనగర్ జిల్లాలో ఘోరం.. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు !

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు. ఇల్లందకుంట మండలం టేకుర్తిలో ఈ దారుణ ఘటన జరిగింది. దుండగులు మహిళ గొంతు కోసి హతమార్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు.

చిగురు మామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన తిరుమలను 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకోగా.. ప్రస్తుతం తిరుమల ఎనిమిది నెలల గర్భవతి. అయితే గత కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి ఎస్ఐ క్రాంతికుమార్ చేపట్టారు.

ఈ ఆగస్ట్ నెలలో ఇలాంటి ఘటన రెండోసారి జరగడంతో కరీంనగర్ జిల్లా వాసుల్లో ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలకేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ (64) కనబడడం లేదని ఆమె తమ్ముడు రాయమల్లు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై వంశీకృష్ణ బృందంగా ఏర్పడి విచారణ చేపట్టగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారులోని పెద్దమ్మ టెంపుల్ సమీపంలోని అడవిలో ఆమె శవంగా కనిపించింది.

దర్యాప్తులో భాగంగా మల్లవ్వను అదే మండలం నాగిరెడ్డిపూర్కు చెందిన గంగరాజు సూచనతో కొత్తపల్లి మండలం మల్కాపూర్కు చెందిన దేవునూరి సతీశ్: దేవునూరి శ్రావణ్. మరికొందరు కిడ్నాప్ చేసి గంభీరావుపేట శివారులోని పెద్దమ్మ ఆలయం వద్ద హత్య చేసి నగలు దోచుకుని శవాన్ని చెత్త కుప్పలో పడేశారు. సతీశ్, శ్రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ప్రధాన నిందితుడు గంగరాజు, మరికొందరు పరారీలో ఉన్నారు. కాగా ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకే మల్లవ్వను హత్య చేసినట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది.