పార్టీ పెట్టి మధ్యలో వెళ్లిపోయిన వారున్నారు.. నేనలా కాదు : విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్

పార్టీ పెట్టి మధ్యలో వెళ్లిపోయిన వారున్నారు.. నేనలా కాదు : విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్

పార్టీ పెట్టామంటే ఎంత కష్టమైనా తట్టుకుని నిలబడే ధైర్యం, స్థైర్యం ఉండాలని.. అవి తనలో ఉన్నాయని అన్నారు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి  మధ్యలో వెళ్లిపోయిన వారున్నారు.. కానీ తాను అలా కాదని  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం (ఆగస్టు 30) వైజాగ్ లో నిర్వహించిన సేనతో జనసేన భారీ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు పవన్.

జనసేన పార్టీపై దృష్టి పెట్టడం కొంత ఆలస్యం అయిందనీ.. అయినా భారతందేశంలోనే అరుదైన ఘనత సాధించామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు పవన్. పార్టీ ఆవిర్భావం నుంచి ఏ సిద్ధాంతాలతో ఉన్నామో అదే సిద్ధాంతాలో కొనసాగుతున్నామని.. కార్యకర్తలు కూడా తన వెంటే  ఉన్నారని అన్నారు. తనను బలహీనపరచాలని చేసిన ప్రయత్నం నుంచి మరింత రాటుదేలి నిలబడినట్లు చెప్పారు. 

తను ఏనాడు వెనకడుగు వేయలేదని చెప్పిన పవన్..తనతో నడిచిన కార్యకర్తలు, అభిమానులే రియల్ హీరోలని కొనియాడారు. యుద్ధంలో తట్టుకుని నిలబడే యోధులు ఎవరు అంటే కాలం, సమయమేనని.. జన సైనికులు కూడా అలాంటి యోధులేనని అన్నారు. జనసేన ఒక కులం కోసమో, కుటుంబం కోసమో, ఒక ప్రాంతానికి పరిమితం కావడానికో పెట్టిన పార్టీ కాదుని.. ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయిలో పార్టీకి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. 

ప్రతి సమస్యకీ పరిష్కారం కోసం పనిచేస్తున్నామని చెప్పిన పవన్.. సంస్థాగత నిర్మాణం ఎలా చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. తను స్వార్థంతో పనిచేయడం లేదని, తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల కోసం పనిచేస్తానని చెప్పారు. తనకో ఐడియాలజీ ఉండాలి.. అది ఉంది అని అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్నో  అవమానాలు ఎదుర్కున్నానని.. 

కమ్యూనిజం, సోషలిజం అర్థం చేసుకుని పార్టీని పెట్టామని చెప్పిన పవన్.. ఎన్నో దేశాలు ఎన్నో రకాలుగా భావజాలాన్ని మార్చుకుంటున్నాయని చెప్పారు. తాను సిద్ధాంతాలపై మాట్లాడానని.. అవగనహంతోనే మాట్లాడానని సమర్ధించుకున్నారు. అన్నింటిలో నలిగి, ముళ్ళు గుచ్చుకున్నా పట్టించుకోకుండా నిలబడ్డానని చెప్పారు. తనతో నిలబడ్డ వారిని ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. 

ప్రజాస్వామ్య పద్ధతుల్లో తుపాకీ అవసరం లేదని చెప్పిన పవన్.. మన మాటే తుపాకీ గుండు లా ఉండాలని సూచించారు. సినిమాలు చేయడం వేరు, రాజకీయాలు చేయడం వేరని అన్నారు.