Rashid Khan: రషీద్ ఖాన్ సోదరుడు మరణం.. పాకిస్థాన్ క్రికెటర్లు ప్రగాఢ సానుభూతి

Rashid Khan: రషీద్ ఖాన్ సోదరుడు మరణం.. పాకిస్థాన్ క్రికెటర్లు ప్రగాఢ సానుభూతి

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సోదరుడు మరణించాడు. అన్నయ్య హాజీ అబ్దుల్ హలీమ్ షిన్వారీ విషాద మరణం తర్వాత క్రికెట్ ప్రపంచం రషీద్ ఖాన్ కు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. శుక్రవారం (ఆగస్టు 29) ఈ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ కు పాకిస్థాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్‌కు సంతాపం తెలుపుతూ ఓదార్చారు. ట్రై సిరీస్ లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన రషీద్ ఖాన్ సోదరుడు చనిపోయినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది రషీద్ ఖాన్‌ను కౌగిలించుకుని.. దుఃఖంలో ఉన్న అతన్ని ఓదార్చాడు.

ఇటీవలే వ్యక్తిగత నష్టంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కుదేలైన కొద్ది రోజులకే ఈ విషాదం జరగడం విచారకరం. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ సహా చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. మాజీ జాతీయ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ "అల్లాహ్ అతనికి స్వర్గంలో అత్యున్నత పదవులను (జన్నతుల్ ఫిర్దౌస్) ప్రసాదించుగాక. గౌరవనీయ కుటుంబానికి అందమైన సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్." అని  తీవ్ర సానుభూతి వ్యక్తం చేశాడు. రషీద్ ఖాన్ అన్న చనిపోవడంతో ట్రై సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆడబోయే మ్యాచ్ కు  రషీద్ ఖాన్ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

శుక్రవారం (ఆగస్టు 29) ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణించాడు. మొదట బౌలింగ్ లో నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టిన రషీద్.. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాడు. 16 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఒక ఫోర్ తో 39 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్థాన్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.