నిర్మల్​ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అంజుకుమార్ రెడ్డి

నిర్మల్​ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అంజుకుమార్ రెడ్డి

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ సీనియర్ నేత అంజు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అంజు కుమార్ రెడ్డి నియామకాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖరారు చేశారు.

జిల్లా అధ్యక్షురాలిగా వ్యహరించిన రమాదేవి ముథోల్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్రబుల్ షూటర్ గా పేరున్న అంజు కుమార్ రెడ్డిని అధిష్టానం ఆ స్థానంలో నియమించింది. ఆయన నియామకం పట్ల ఇక్కడి బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.