
హైదరాబాద్ వెలుగు : ఐదో ఎడిషన్ వేవ్‌రన్ మినీ మారథాన్ లో అంకిత్ కుమార్, కీర్తి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్‌లోనిఐటీ సెజ్ వేవ్‌రాక్‌లో జరిగిన 10 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో అంకిత్ (ఆర్‌ఎంఎస్‌ఐ) విన్నర్‌గా నిలవగా, మల్లేష్ (కంప్యూగేన్) రెండో స్థానం సాధించాడు. మహిళల విభాగంలో కీర్తి (అవేవా)విన్నర్‌గా, శ్రావని (టీసీఎస్) రన్నరప్‌గా నిలిచారు. ఉత్సాహపూరిత వాతావరణంలో సాగిన వేవ్‌రన్ ను తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వేవ్‌రాక్ సీనియర్ డైరెక్టర్, హెడ్ కల్నల్ సంజయ్ భరద్వాజ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
10కే, 5కే, 3కెకేఈవెంట్లలో 3500 మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. 5కె ఈవెంట్ పురుషుల్లో సురేందర్, వేణుగోపాల్ తొలి రెండు స్థానాలు కైవసం చేసుకోగా.. మహిళల్లో పూర్ణిమ, మనోజ్ఞ టాప్2 స్థానాలు కైవసం చేసుకున్నారు. 3కే ఈవెంట్ పురుషుల్లో సంతోష్ (ఆక్సెంచర్), పురంధర్ (టీసీఎస్), మహిళల్లో రీమా (అవేవా), నిత్య (డీబీఎస్) విన్నర్, రన్నరప్‌గా నిలిచారు.