అర్ధరాత్రి అన్నవరం గ్యాంగ్ వీరంగం ..కేపీహెచ్ బీ కాలనీలో యువతితో అసభ్య ప్రవర్తన

అర్ధరాత్రి అన్నవరం గ్యాంగ్ వీరంగం ..కేపీహెచ్ బీ కాలనీలో  యువతితో అసభ్య ప్రవర్తన

 

  • అడ్డొచ్చిన యువకుడు, హాస్టల్​ నిర్వాహకులపై దాడి

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలో దుర్గాప్రసాద్​అలియాస్​అన్నవరం గ్యాంగ్ వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి, అడ్డొచ్చినవారిపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్​బీ కాలనీ మూడో రోడ్డులోని శ్రీసూర్య బాయ్స్​హాస్టల్ సమీపం నుంచి శనివారం అర్ధరాత్రి ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది.

 అన్నవరం గ్యాంగ్​లోని దాదాపు 10 మంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న వెంకటేశ్ అనే యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణభయంతో హాస్టల్​లోకి పరుగెత్తినా వదలలేదు. హాస్టల్ నిర్వాహకులపైనా దాడికి పాల్పడి, కిటికీల అద్దాలు ధ్వంసం చేసి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.