
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 11వ పీఆర్సీ గడువు జూన్తోనే ముగిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ స్టేట్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ అన్నారు. జులై నుంచి అమల య్యేలా తక్షణమే 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు.
3 నెలల వ్యవధిలో నివేదిక సమర్పించేలా 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.