
చేవెళ్ల, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్మాజీ చైర్మన్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం బీఆర్ఎస్ పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీలో జాయిన్ అయితున్నట్లు ప్రకటించారు. పదేళ్లుగా బీఆర్ఎస్లో ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కార్యకర్తగా కొనసాగుతూ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
చేవెళ్ల నుంచి పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ కలిగించిందని, అందుకే ప్రజల కోరిక మేరకు పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇయ్యాల ఉదయం 11 గంటలకు చేవెళ్లలోని కేజీఆర్ హాల్లో బీజేపీ తరఫున స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు. బీజేపీ రాష్ర్ట, జిల్లా, నియోజకవర్గం, మండల, పోలింగ్బూత్ నాయకులు సమావేశానికి హాజరు కావాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.