జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు : ఉప సర్పంచ్‌గా ఎన్నికైన ఓ వ్యక్తి ప్రమాణస్వీకారం రోజునే తన పదవికి రాజీనామా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన రాజూరి శ్రీనివాస్ ఎనిమిదో వార్డు సభ్యుడిగా గెలిచి.. ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.
సోమవారం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన శ్రీనివాస్.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, ఆ లెటర్‌ను సెక్రటరీకి అప్పగించారు. అనంతరం వార్డు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేసినట్లు లెటర్‌లో పేర్కొన్నారు.
