అటవీ అధికారుల కృషితోనే సాహెబ్నగర్ కేసులో అనుకూల తీర్పు : పీసీసీఎఫ్ సువర్ణ

అటవీ అధికారుల కృషితోనే  సాహెబ్నగర్ కేసులో  అనుకూల తీర్పు : పీసీసీఎఫ్  సువర్ణ
  •  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సువర్ణ 

హైదరాబాద్, వెలుగు: అటవీ అధికారులు సమష్టి కృషితోనే సాహెబ్ నగర్ కలాన్ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. ఈ కేసులో సీఎం, ఫారెస్ట్ మినిస్టర్, న్యాయశాఖ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో సాహెబ్ నగర్ కలాన్ కేసులో కీలకంగా పనిచేసిన అధికారులను ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా డా. సువర్ణ మాట్లాడారు. సాహెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇది అటవీ సంరక్షణ, చట్ట పరిరక్షణకు ఒక గొప్ప విజయమని చెప్పారు.