టీఎన్జీవోలో మరో లొల్లి

టీఎన్జీవోలో మరో లొల్లి
  • ఎన్నిక లేకుండా హైదరాబాద్ సిటీ యూనియన్​కు కొత్త కమిటీ ప్రకటన
  • కోర్టు ఉత్తర్వులు అతిక్రమించి ఎలక్షన్ ఆఫీసర్ నియామకం
  • మరోసారి కోర్టుకు వెళ్తామంటున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ (టీఎన్జీవో) లో మరో లొల్లి షురూ అయింది. సిటీ యూనియన్ కు ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షంగా కొత్త కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఎన్జీవో కేంద్ర సంఘంలో జనరల్ సెక్రటరీ ఎన్నిక రూల్స్ కు విరుద్ధంగా జరిగిందని సిటీ సివిల్ కోర్టులో కేసు నడుస్తున్నది.

ఈ కేసు నేపథ్యంలో టీఎన్జీవో లో ఎలాంటి కార్యకలపాలు నిర్వహించొద్దని కోర్టు స్టే ఇచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇప్పుడు కొత్త కమిటీని ప్రకటించటంతో దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మరో వైపు కొత్త జనరల్ సెక్రటరీ ఎన్నికపై కోర్టులో కేసు ఉండటంతో టీఎన్జీవో ప్రెసిడెంట్ పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉంది.

గడువు ఉన్నా ముందే రద్దు

టీఎన్జీవో సిటీ కమిటీకి మార్చ్ 2024 వరకు గడువు ఉంది. అయితే కేంద్ర సంఘం నేతలు యూనియన్ గతేడాది ఏప్రిల్​లో కమిటీని రద్దు చేసి ఆరు నెలల కోసం తాత్కాలికంగా అడహాక్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ టైమ్ లో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. అకారణంగా ఏడాది ముందుగానే కమిటీ రద్దు చేశారని సిటీ యూనియన్ నేతలు అప్పట్లో ఆరోపించారు.

ఈ అడహాక్​ కమిటీ గడువు గత నెలలోనే ముగియటంతో ఎన్నిక నిర్వహించకుండా హడావుడిగా కొత్త కమిటీని ప్రకటించారు. సిటీ యూనియన్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ కు టీఎన్జీవో జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్ నియామకపత్రం అందజేశారు.

ఆరు వేల మంది ఓటర్లు

హైదరబాద్ సిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ హెచ్​వోడీ లు, డైరెక్టరేట్​ల పరిధిలో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి డిపార్ట్ మెంట్ కు టీఎన్జీవో కమిటీ ఉండటంతో పాటు సిటీ యూనియన్ లో వీరంతా సభ్యులుగా ఉంటారు. యూనియన్ టర్మ్ ఆరు నెలల్లో పూర్తి అవుతుందనగా మెంబర్ షిప్

ఓటర్ లిస్ట్, ఎలక్షన్ ఆఫీసర్ల నియామకం, ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయటం, ఎలక్షన్ పై మీడియాలో ప్రకటనలు, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ ఇలా 15 రోజుల ప్రాసెస్ ఉటుంది. అయితే ఇవేం పాటించకుండా తాజా కమిటీని ప్రకటించారు.

కొత్త కమిటీపై కోర్టుకు వెళ్త

ఈ ఏడాది మార్చ్ వరకు మా కమిటీ కి గడువు ఉంది. కానీ గతేడాది ఏప్రిల్ లో కేంద్ర సంఘం కమిటీని రద్దు చేసి ఆరు నెలలకు అడహాక్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ గడువు పూర్తయిన మరుసటి రోజే మరో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికలు నిర్వహించకుండా ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ ను కేంద్ర సంఘం నియమించాలి.

ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని కేంద్ర సంఘంపై కోర్టులో స్టే ఉంది. అయితే రూల్స్ కు విరుద్ధంగా తాజా నియామకం చేపట్టారు. కొత్త కమిటీని రద్దు చేయకపోతే కోర్టుకు వెళ్తాను. లేకపోతే గడువు మార్చ్ వరకు ఉన్న నేపథ్యంలో కొత్త కమిటీని రద్దు చేసి అప్పటి వరకు పాత కమిటీనే కొనసాగించాలె.

‑ శ్రీరామ్, టీఎన్జీవో హైదరాబాద్​సిటీ ప్రెసిడెంట్