
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. నవంబరు 16వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు... రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
- నవంబర్ 17 (సోమవారం) ...ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) .... చిన్నశేషవాహనం
- నవంబర్ 18 (మంగళ వారం).. పెద్దశేషవాహనం .... హంసవాహనం
- నవంబర్ 19-(బుధవారం) .... ముత్యపుపందిరి వాహనం .... సింహవాహనం
- నవంబర్ 20 (గురువారం) ... కల్పవృక్ష వాహనం ... హనుమంతవాహనం
- నవంబర్21 (శుక్ర వారం) ....పల్లకీ ఉత్సవం.... గజవాహనం
- నవంబర్22(శనివారం) ....సర్వభూపాలవాహనం
- నవంబర్22(శనివారం) సాయంత్రం.... స్వర్ణరథం... గరుడవాహనం
- నవంబర్23(ఆదివారం) ....సూర్యప్రభ వాహనం , చంద్రప్రభ వాహనం
- నవంబర్24(సోమవారం).... రథోత్సవం ... అశ్వ వాహనం
- నవంబర్25(మంగళవారం) ....పంచమీతీర్థం ...ధ్వజావరోహణం