దేశంలో కొత్తగా 20వేల కేసులు, 36 మరణాలు

దేశంలో కొత్తగా 20వేల కేసులు, 36 మరణాలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 20వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.36 మంది కరోనా వైరస్ తో చనిపోయారు. ముందురోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 5.3శాతం తగ్గినప్పటికీ గడిచిన 24 గంటల్లో 2100 యాక్టివ్‌ కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య లక్షా 52వేలకు చేరింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 4.38 కోట్లు దాటింది. శనివారం 36 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,26,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా కేసులు 20 లక్షల మార్కును తొలిసారి 2020 ఆగస్టు 7న దాటింది. ప్రతినెలా సుమారు 10 లక్షల కొత్త కేసులతో డిసెంబర్‌ 2020 నాటికి కోటికి చేరుకొంది. 2021 మే నెల నాటికి రెండు కోట్లు, జూన్‌ నాటికి మూడు కోట్ల కేసులు నమోదయ్యాయి.