హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. కత్తులతో రౌడీషీటర్‪ని నరికి

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. కత్తులతో రౌడీషీటర్‪ని నరికి

హైదరాబాద్: నగరంలో వరుస హత్యలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. చాదర్ ఘాట్ పీ ఎస్ కు దగ్గర్లో మలక్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి రౌడీ షీటర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. మృతుడు రెయిన్ బజార్ కు చెందిన సయ్యద్ నజఫ్ అలీ అనే రౌడీ షీటర్ గా పోలీసులు గుర్తించారు. నజఫ్ అలీ పై 3 మర్డర్ కేసులు ఉన్నా.. 2021 నుంచి ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడలేదు. కానీ.. నజఫ్ అలీపై గుర్తు తెలియని వ్యక్తులు చదార్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో వద్ద దగ్గర కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

అదే రీతిలో బేగంపేటలో గురువారం హత్య జరిగింది. వరుస మడ్డర్లతో హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. పోలీసు ఉన్నత అధికారులు, డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ మలక్ పేట శ్యామ్ బాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి, మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.