
ఐపీఎల్ 2025 ఫైనల్ లో టాస్ ఓడిన ఆర్సీబీకి మరో మరో బ్యాడ్ న్యూస్. ఆ టీమ్ కీలక ఆటగాడు టిమ్ డేవిడ్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయంతో దూరమైన టిమ్ డేవిడ్.. కీలక మ్యాచ్ లో లేకపోవడం ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఇక ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన అన్ని ఫైనల్ మ్యాచ్ లలో ఛేజింగ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ ఛేజింగ్ చేసిన అన్ని మ్యాచ్ లలో ఆర్సీబీ ఓడిపోయింది. కానీ ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుండటం విశేషం. మరి ఈసారి మ్యాచ్ ఎలా మలుపు తిరుగుతుందో, ఆర్సీబీ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్