అనిల్ అంబానీపై, రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా మరో కేసు

అనిల్ అంబానీపై, రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా మరో కేసు

న్యూఢిల్లీ: అనిల్ అంబానీపైనా, రిలయన్స్ కమ్యూనికేషన్స్​పైనా రూ. 2,929 కోట్ల ఎస్​బీఐ లోన్​మోసం కేసులో కొత్త కేసును ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  నమోదు చేసింది.  సీబీఐ నివేదిక ఆధారంగా కొత్త కేసు పెట్టింది. ఎస్​బీఐ నుంచి లోన్​తీసుకోవడానికి అక్రమాలకు పాల్పడ్డారని, ఆ డబ్బునూ దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అనిల్ అంబానీ, ఆయన కంపెనీలపై ఈడీ ఇప్పటివరకు మూడు వేర్వేరు మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. బ్యాంకులను రూ. 17 వేల కోట్లకు పైగా మోసం చేశారని ఈడీ ఆరోపించింది.

సీబీఐ గత నెల నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్​ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఎస్​బీఐను మోసం చేసి రూ. 2,929.05 కోట్ల నష్టానికి కారణమైనట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్​పైనా దాని మాజీ చైర్మన్​ అనిల్ అంబానీపైనా ఆరోపణలు ఉన్నాయి. రుణాలను దుర్వినియోగం చేశారని  ఇప్పటి వరకు మూడు బ్యాంకులు అనిల్ అంబానీపై  ఆరోపణలు చేశాయి.