హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా యూసఫ్ గూడలో కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు.
అనుచరులతో కలిసి మహమ్మద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా లోపలికి నెట్టుకెళ్లారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్ రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రేస్ పాస్తో పాటు న్యూసెన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
